టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. కాగా, తాజాగా ఆమె తన ఆరోగ్య సమస్య సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను ఆమె వివరించారు.
సమంత(Samantha)తనకు వ్యాధి నిర్ధారణ జరిగి సంవత్సరం అయ్యిందని పేర్కొంది. దాంతో ఈ ఏడాది ఎప్పుడూ ఊహించని కొత్త పరిస్థితులు ఎదుర్కొన్నానని, తన శరీరంతో తాను చాలా సార్లు పోరాడానని ఆమె పేర్కొన్నారు. కనీసం ఉప్పు, పంచదార కూడా లేని ఆహారం తీసుకున్నానని, మందులు మాత్రమే తన ఆహారమయ్యాయని ఆమె పేర్కొనారు. బలవంతంగా కొన్ని వదిలేయాల్సి వచ్చిందని, బలవంతంగా కొన్ని అలవాటు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ సంవత్సరం మొత్తం తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సరిపోయిందన్నారు. అంతేకాకుండా, తాను జీవితంలో ఎప్పుడూ చేయని పూజలు చేసినట్లు చెప్పారు. అది కూడా తనకు శక్తి ఇవ్వమని, ప్రశాంతతను ఇవ్వమని కోరుకున్నానని చెప్పారు. ఈ సంవత్సరం తనకు ఎన్నో నేర్పించిందని ఆమె అన్నారు. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలో తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు.
తన చేతుల్లో ఉన్నది మాత్రమే కంట్రోల్ చేయగలిగానని, తన చేతుల్లో లేనిదానిని ఏం చేయలేక వదిలేయడం తాను నేర్చుకున్నానని ఆమె చెప్పడం విశేషం. ప్రతిదీ నూటికి నూరుశాతం సవ్యంగా జరగాలని ఎదురు చూస్తూ కూర్చోకూడదని, గతాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదని తెలుసుకున్నానని చెప్పారు. తాను కేవలం తనను ప్రేమించే వారినే ప్రేమిస్తానని చెప్పారు. దేవుడు(god) మనకు ఇవ్వాల్సినవి ఆలస్యం చేస్తారేమో కానీ, మన చేతిని మాత్రం వదిలిపెట్టరు. అంటూ ఆమె పేర్కొనడం విశేషం.