TG: హైదరాబాద్‌లో కుళ్లిన మాంసం విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళహాట్ ప్రాంతంలోని మటన్ షాపుపై దాడి చేశారు. ఈ క్రమంలో 300 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, జమ్మూ నుంచి తక్కువ ధరకు మాంసం తీసుకొచ్చి హోటల్స్‌లో అమ్ముతున్న మటన్ షాప్ నిర్వాహకుడు మహ్మద్‌ను అరెస్ట్ చేశారు.