NGKL: కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రిలో మైనర్ బాలికకు అబార్షన్ చేశారన్న ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, డీఎంహెచ్వో డా.రవి కుమార్ సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల అనంతరం ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.