PLD: మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలోని KGBVలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నాట్లు ప్రిన్సిపాల్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు విద్యార్థుల ప్రవేశాలకు ఇవాళ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.