ఏపీ(AP) లోని మారుమూల ప్రాంతలకు 4జీ సేవలు అందించే లక్ష్యంతో..100 జియో టవర్లను సీఎం జగన్ (CM JAGAN) పర్చల్గా ప్రారింభించారు. దీని ద్వారా 209 మాారుమూల గ్రామాలకు మొబైలు సేవలు అందనున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా(Allur District)లో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు.
చదవండి :ఒలింపిక్స్లో జూదం నిర్వహిస్తే ఏపీకే మొదటి స్థానంలో : ప్రత్తిపాటి పుల్లారావు
టవర్లను ఏర్పాటు చేసిన రిలయన్స్ జియో (Reliance Jio) సంస్థ.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్గ్రేడ్ చేయనుంది. కొత్తగా ప్రారంభించిన సెల్టవర్ల వల్ల మారుమూల ప్రాంతాలనుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనుల(Tlriba)తో సీఎం జగన్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.