HYD: నగరాన్ని తీవ్రమైన గ్యాస్ కొరత వణికిస్తోంది. చర్లపల్లి ప్లాంట్ వద్ద లారీలు, సీఎన్జీ స్టేషన్ల వద్ద ఆటోలు గంటల తరబడి నిలిచిపోయాయి. గ్యాస్ లేక హోటళ్లు వెలవెలబోతుండగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టౌవ్ల వైపు మళ్లుతున్నారు. సరఫరా వెంటనే పునరుద్ధరించకపోతే ‘HYD బంద్’ అయి నగర జనజీవనం స్తంభించి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.