అన్నమయ్య జిల్లాలో చెరువులను నింపి భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన ప్రాజెక్టు జలధారా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. జిల్లాలో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి కనీసం 3-4 మీటర్ల వరకు భూగర్భ జలాలను పెంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.