School Fee: జూన్ 12 వచ్చింది.. స్కూల్స్లో బడి గంట మోగింది. పేరంట్స్ గుండె గుబేల్ అంటోంది. అవును.. స్కూల్స్ స్టార్ట్ అంటే చాలు ఫీజుల మోతే (School Fee). కొత్తగా జాయిన్ చేస్తే అంతే సంగతులు.. వారి పని అయిపోయినట్టే.. మరీ సర్కార్ బడికి పంపించలేని సిచుయేషన్.. ఓ మోస్తరు బడిలో అయినా సరే ఫీజుల బాదుడు మాములుగా ఉండటం లేదు.
స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే.. బుక్స్ నుంచి బాదుడు మొదలవుతోంది. డ్రెస్సులు, షూ, స్పోర్ట్స్ డ్రెస్సులు అని.. టర్మ్ ఫీజు అని డబ్బులు వసూల్ చేస్తుంటారు. దీనికితోడు ఏటా 20 నుంచి 30 శాతం వరకు ఫీజు పెంచుతున్నారు. మరీ ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు. జీవో నంబర్ 91 ప్రకారం అప్లికేషన్ ఫీజు రూ.100, అడ్మిషన్ ఫీజు రూ.500 తీసుకోవాలి. బుక్స్, ఇతర నీడ్స్ స్కూల్లో కొనుగోలు చేయాలనే నిబంధన ఉండొద్దు. సెక్షన్ 8(1) ప్రకారం విద్యాసంస్థ పేర్లకు ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో వంటి పదాలు కూడా చేర్చొద్దు. జీవో 88 ప్రకారం 200 మంది విద్యార్థులు చదివే స్కూల్లో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రౌండ్ ఉండాలి. కానీ ఏ స్కూల్ పాటించడం లేదు. ఫీజు మాత్రం పక్కగా వసూల్ చేస్తుంటారు. ఇంత జరుగుతోన్న విద్యాశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
వరంగల్ (warangal), హన్మకొండ (hanmakonda) లాంటి నగరాల్లో 200 పైచిలుకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సొంత గ్రౌండ్ కలిగిన స్కూల్స్ చాలా తక్కువ. కనీస ప్రమాణాలు, విద్యా నిబంధనలు పాటించకుండా నడిపిస్తున్నాయి. ఎల్కేజీకి రూ.30 వేలకు పైగా ఫీజు ముక్కుపిండి మరీ వసూల్ చేస్తున్నాయి. మళ్లీ బుక్స్కి వేరే ఫీజు ఉంటుంది. ఆ పై తరగతుల వారి సంగతి తెలియనే తెలిసింది. ఏ పేరంట్ కూడా స్కూల్ యాజమాన్యాల గురించి ఫిర్యాదు చేయడం లేదు. దీంతో వారిది ఆడిందే ఆట.. పాడిందే పాట అవుతోంది.