AKP: దేవరాపల్లి మండలంలో అన్ని పంచాయతీల్లోనూ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు సోమవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సువర్ణ రాజు తెలిపారు. ఉపాధి పథకం పేరును వీబీ జీ రామ్ గా కేంద్ర ప్రభుత్వం మార్చిన నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త చట్టం ప్రకారం వేతనదారులకూ 125 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందన్నారు.