HYD: సికింద్రాబాద్ DRM గోపాలకృష్ణన్ సంబంధిత అధికారులతో కలిసి కోచ్ డిపో తనిఖీ చేశారు. కోచ్ల భద్రత, నిర్వహణ ప్రమాణాలు, సిబ్బంది పనితీరు, ప్రమాద నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా మరింత అప్రమత్తంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. సేఫ్టీ అత్యంత ముఖ్యమని కిందిస్థాయి అధికారులకు సూచించారు.