NGKL: నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఎస్పీ ఇంఛార్జ్‌గా తూడుకుర్తి గ్రామానికి చెందిన బండి పృథ్వీరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.