»India Will Host The Odi World Cup 2023 Hyderabad Will Not Get A Place In The Schedule
ODI వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..కానీ హైదరాబాద్ కు నో ఛాన్స్
క్రికెట్‌పై అత్యంత మక్కువ ఉన్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ కు ప్రపంచ కప్(ODI World Cup 2023) షెడ్యూల్లో భాగంగా చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో WCలో భారత్ మ్యాచ్ చూడాలని ఎదురుచూస్తున్న హైదరాబాద్ అభిమానులకు నిరాశ ఎదురైంది.
13వ ఎడిషన్ ODI క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ షెడ్యూల్ తేదీలోను బీసీసీఐ తాత్కాలికంగా ప్రకటించింది. కానీ హైదరాబాద్(hyderabad)లో మ్యాచ్ గురించి ఏమి ప్రకటించలేదు. దీంతో ఇక్కడి క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ODI క్రికెట్ వరల్డ్ కప్ 13వ ఎడిషన్ ఇండియాలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19, 2023 వరకు కొనసాగనుంది. బ్లాక్‌బస్టర్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
1987 (పాకిస్తాన్), 1996 (పాకిస్థాన్, శ్రీలంకతో), 2011 (శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో) సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన తర్వాత భారతదేశం మొదటిసారిగా ODI ప్రపంచ కప్ 2023కి పూర్తిగా ఆతిథ్యం ఇస్తుంది. మొత్తం 45 మ్యాచ్‌ల కోసం గ్రూప్ దశలో 10 జట్లు ఒకదానితో ఒకటి ఆడనున్నాయి. మొదటి 4 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే ముసాయిదా షెడ్యూల్లో సెమీఫైనల్‌కు సంబంధించిన వేదికలను ఇంకా పేర్కొనలేదు. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ జరగనుంది.
ODI ప్రపంచ కప్ 2023 టీమ్ ఇండియా డ్రాఫ్ట్ షెడ్యూల్
భారతదేశం vs ఆస్ట్రేలియా సన్, అక్టోబర్ 8న – MA చిదంబరం స్టేడియం, చెన్నై
భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ బుధవారం, అక్టోబర్ 11న – అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
భారతదేశం vs పాకిస్తాన్ సన్, అక్టోబర్ 15న – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
భారతదేశం vs బంగ్లాదేశ్ గురు, అక్టోబర్ 19న- MCA స్టేడియం, పూణే
భారతదేశం vs న్యూజిలాండ్ సన్, అక్టోబర్ 22న- HPCA స్టేడియం, ధర్మశాల
భారతదేశం vs ఇంగ్లాండ్ సన్, అక్టోబర్ 29న- ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
భారతదేశం vs క్వాలిఫైయర్ గురు, నవంబర్ 2న- వాంఖడే స్టేడియం, ముంబై
భారత్ vs దక్షిణాఫ్రికా సన్, నవంబర్ 5న – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
భారతదేశం vs క్వాలిఫైయర్ శనివారం, నవంబర్ 11న – M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
ఇతర ముఖ్యమైన మ్యాచ్‌లు – అక్టోబర్ 29న ధర్మశాలలో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, నవంబర్ 4న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, నవంబర్ 1న పూణేలో న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచులు కూడా జరగనున్నాయి.
వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 5 సార్లు విజేతగా నిలిచింది. భారత్ (1983, 2011), వెస్టిండీస్ (1975, 1979) 2 సార్లు విజయం సాధించాయి. పాకిస్థాన్ (1992), శ్రీలంక (1996) ఒక్కోసారి గెలిచాయి. 2019లో స్వదేశంలో తొలి టైటిల్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.