SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ ఓటర్ల జాబితాపై శనివారం 24 అభ్యంతరాలు అందినట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తమ పేర్లు ఒక వార్డు బదులుగా మరో వార్డులో నమోదయ్యాయని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఐదవ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరిస్తామని, వాటిని పరిశీలించి సవరణలు చేసి పదవ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.