KNR: రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద శనివారం రేలారే రేలా ఫ్రేమ్ భూక్య గంగాధర్ నాయక్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ పాటను చిత్రీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కళాకారులను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంగ్ యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. సాంగ్ చిత్రీకరణకు గ్రామస్థులు, ఆలయ కమిటీ ఎంతో సహకరించారని తెలిపారు.