MBNR: జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు.