AP: మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీనివాస కల్యాణంతో అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 5వ తేదీ వరకు మహాసభలు కొనసాగనున్నాయి. సభా ప్రాంగణంలో రామోజీరావు, ఎన్టీఆర్, మంగంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాలు ఏర్పాటు చేశారు.