ATP: ఉరవకొండ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీరందించే మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం పునఃప్రారంభించింది. మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ఆమిద్యాల గ్రామంలోని నెటాఫిం స్టాక్ గోడౌన్ను సందర్శించి సామగ్రిని పరిశీలించారు. ఈ పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.