TPT: జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరా శాఖ చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ వేంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో 1,30,350 ఎకరాల్లో సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితున్నట్లు తెలిపారు. గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.