MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న రైతు వేదికకు పలు గ్రామాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వారు ఇవాళ ఉదయం రైతు వేదికకు వచ్చి స్థానిక ఏవో త్రిసంధ్య వద్ద ఫార్మరీ రిజిస్ట్రీలో పేర్లను నమోదు చేయించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనం పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరని ఆమె తెలిపారు.