VZM: ఆత్మ రక్షణ మెళుకువలు, స్వశక్తితోనే రక్షణ పొందవచ్చునని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండులో మహిళ ఫుట్ బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాంధీ ఫౌండేషను ఆధ్వర్యంలో నిర్వహించిన తూఫాన్ ఫుట్ బాల్ టోర్నమెంటును ఆయన శనివారం ప్రారంభించారు. ప్రతీ మహిళ ఇతరులపై ఆధారపడకుండా స్వచ్ఛందంగా ఆత్మరక్షణ మెళుకువలను నేర్చుకోవాలన్నారు.