PDPL: ఏటీసీ నైపుణ్య కోర్సుల ద్వారా యువతకు తప్పనిసరిగా ఉపాధి లభిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఆయన పెద్దపల్లి ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్ను సందర్శించారు. కోర్సుల వివరాలు, ఉపాధి అవకాశాలను తెలుసుకున్నారు. గత సంవత్సరం ప్రారంభించిన సెంటర్లో ఇప్పటివరకు శిక్షణ పొందిన 70 మందికి ఉపాధి లభించినట్లు కలెక్టర్ తెలిపారు.