NLG: చింతపల్లి మండలం మదనపురానికి చెందిన పల్లెపు రాణి(40) హైదరాబాద్ వనస్థలిపురంలో మరణించింది. ఆమె గర్భసంచి ఆపరేషన్‌కు ఓ హాస్పటల్‌కు వెళ్తే ఆపరేషన్ చేయగా.. వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిందని మృతురాలి తల్లి ఆరోపించింది. తర్వాత మరో హాస్పిటల్‌కు తరలించారని తెలిపింది. మృతురాలికి కొడుకు(21), కూతురు(19) ఉన్నారు. భర్త కొన్ని ఏళ్ల క్రితం చనిపోయాడు.