GNTR: మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు విద్యా సంస్థల్లో ‘సంకల్పం’ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం తెనాలి రూరల్ సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో 4 కాలేజీలు, 6 హైస్కూల్స్‌లో ఈ ఫిర్యాదు పెట్టెలను అమర్చారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం ఉన్నవారు ఈ బాక్సుల ద్వారా రహస్యంగా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.