విజయనగరం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ముందుగా ఆయన జిల్లా ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 4వ తేదిన భోగాపురం విమానాశ్రయంలో మొదటి ట్రయల్ ఫ్లైట్ రన్ వేపై దిగనుందన్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిసి కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.