WGL: నల్లబెల్లి(M)కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగులు ఆసరా పెన్షన్ కోసం పోస్ట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. నెల రోజులు గడిచినా ఇప్పటికీ పెన్షన్ జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వృద్ధులకు పెన్షన్ అందించాలని కోరారు.