WNP: పానల్ మండలం వెంగలాయపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని సర్పంచ్ బంగ్లా అనసూయమ్మ అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.