ADB: రైతుల పంటలను కొనుగోళ్లు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఈ మేరకు గురువారం BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల వైఖరికి నిరసనగా రైతులకు అండగా బీఆర్ఎస్ ఈనెల 2నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.