VSP: భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన థీమ్‌తో జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రహదారి భద్రతా మాసాన్ని నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ విశాఖ జిల్లా పీఆర్ఓ బి. అప్పలనాయుడు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు సమావేశమై భద్రతా కార్యక్రమాలపై చర్చించారు. డ్రైవర్లకు మెడికల్ పరీక్షలు, ఆల్కహాల్ టెస్టులు, సేఫ్టీ డ్రైవింగ్ శిక్షణలు నిర్వహించాలని ఆదేశించారు.