MDK: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మహాసభల కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ, అధికారులు పాల్గొన్నారు.