AP: వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం చేసిన పాపాల చిట్టాపై వరుసగా విచారణలు జరుగుతున్నాయని అన్నారు. తప్పు చేసిన వాళ్లెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. గత సంవత్సరం మద్యం అక్రమాలతో మద్యం నామ సంవత్సరంగా మారిందని, వైసీపీ నాయకులు దాని ద్వారా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.