ADB: సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు సీఈఐఆర్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం సూచించారు. జిల్లాలో మొదటినుంచి ఇప్పటివరకు 1500 సెల్ఫోన్లు బాధితులకు తిరిగి అందజేసినట్లు వివరించారు. ఈ ఫోన్లు తిరిగి రాబట్టడం కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మొబైల్ రిపేరింగ్ దుకాణాలలో పాత సెల్ఫోన్లు కొనరాదని అన్నారు.