అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నివాసంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అనంత ఆకాంక్షించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.