WGL: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలోని 12 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఎన్నికల జాబితాను సిద్ధం చేసి మున్సిపల్ కార్యాలయ నోటిస్ బోర్డుపై ప్రచురించినట్లు ఇవాళ మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ తెలిపారు. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు.