ATP: ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మురుడి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభాలు నింపాలని ఆకాంక్షించారు.