KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల ఓటర్ల జాబితాను వార్డుల వారీగా రూపొందించి గురువారం నోటీస్ బోర్డులో ఏర్పాటు చేశామని కమిషనర్ ఆయాజ్ తెలిపారు. వార్డు ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. వార్డు మార్పులు, పేర్లు, చిరునామా వంటి ఇతర అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.