SDPT: నూతన సంవత్సరం సందర్భంగా వర్గల్ విద్యాసరస్వతి, నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వర్గల్లో అమ్మవారికి విశేష అభిషేకాలు, స్వర్ణకిరీటాది అలంకరణలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండాయి. అమ్మవారి దివ్యమంగళ దర్శనంతో భక్తులు తరించారు. దాదాపు 60 వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శించుకున్నారు.