రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సందర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ ఛైర్పర్సన్ బేగం ఖలిదా జియా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. అక్కడి కండోలెన్స్ బుక్‌లో సంతకం చేశారు. ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఖలిదా జియా కుటుంబ సభ్యులకు, బంగ్లాదేశ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.