WNP: ఘనపూర్‌లోని బేస్తగేరిలోని శ్రీ కోనేరు హనుమాన్ ఆలయంలో సర్పంచ్ ఆగారం పద్మమ్మప్రకాష్ ఆధ్వర్యంలో అభివృద్ధిపనులు చురుకుగా సాగుతున్నాయి. ఆలయ ఆవరణలో గుంతలను మొర్రాంతో పూడ్చి చదును చేశారు. రోడ్డుకు అడ్డంగాఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి, పాడైన తాగునీటి బోరును రిపేరుచేసి నీటి సమస్యలు పరిష్కరించారు. ఈ సందర్భంగా మాలాధారణ స్వాములు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.