కొత్త ఏడాది వేళ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.111 పెంచింది. దీంతో వాటి ధర రూ.1,619కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.