కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ సింహాద్రి మనోహర్ని గుడివాడ నియోజకవర్గ రాధా రంగా మిత్ర మండలి సభ్యులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో వారు మున్సిపల్ కమీషనర్ని షాలువాతో సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధి, ప్రజా సేవలలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.