కొత్త ఆశలు, ఆశయాలతో యావత్ దేశం ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ 2026కి ఘన స్వాగతం పలుకుతోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ అభిమానులకు, ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. ‘కోటి ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదిని స్వాగతిద్దాం. అందరం అందమైన అనుభవాలను పోగు చేసుకుందాం’ అని చిరంజీవి పోస్ట్ పెట్టారు. అలాగే మహేష్ బాబు, కమల్ హాసన్, కిరణ్ అబ్బవరం, ఎన్టీఆర్ తదితరులు విషెస్ చెబుతున్నారు.