AP: మాజీ సీఎం జగన్పై మంత్రి లోకేష్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి నిరోధకుడుగా పేరుగాంచిన జగన్.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతిని వ్యతిరేకించారు.. విద్యుత్ ఒప్పందాలు రద్దు చేశారని మండిపడ్డారు. ఐటీలో ఉద్యోగ కల్పనకు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలతో పిల్స్ వేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజాభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు.