NRPT: సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో ధన్వాడ మండల కేంద్రంలో బుధవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వైద్యులు రోగులకు బీపీ, షుగర్, హెచ్ఐవీ, హెపటైటిస్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డా. సత్య ప్రకాష్ రెడ్డి, డా. అనూష తదితరులు పాల్గొని ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు