W.G: తాడేపల్లిగూడెం (M) జగన్నాధపురంలోని సకల జనుల దర్గా వద్ద జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు 109వ ఉరుసు మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 2న ఘుమ్మాస్పై సందల్ (గంధం) పూయడం, 3న సాయంత్రం గుర్రంపై సందల్ ఊరేగింపు, 4న దీపాల మహోత్సవం, వివిధ పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.