చిత్తూరులో ఎమ్మెల్యే జగన్మోహన్ బుధవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 8 గంటలకు 36వ వార్డులో పింఛన్ల పంపిణీ, 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో ట్రై సైకిళ్ల పంపిణీ, 11:30 గంటలకు సీబీ రోడ్ ఆంజనేయస్వామి ఆలయంలో అన్నదాన పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొంది.