AP: గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సచివాలయాలను ‘స్వర్ణ గ్రామ’,’స్వర్ణ వార్డు సచివాలయాలు’ పిలవాలని పేర్కొంది. ఈ మేరకు చట్ట సవరణ ఆర్డినెస్స్ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కార్యనిర్వాహకుల పాత్రలు, బాధ్యతలు సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.