KDP: ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారని ఆయన కుటుంబీకులు తెలిపారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2004లో కోడూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.