SRCL: వేములవాడలో జరుగనున్న మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర సందర్భంగా 8 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు, 119 మంది ఎస్సైలు, 158 ఏఎస్సైలు, 388 కానిస్టేబుళ్లు, హోమ్ గార్డ్స్ కలిపి మొత్తం 1300 మందికి పైగా పోలీసులు మూడు రోజులు బందోబస్త్ నిర్వహిస్తామన్నారు.