NGKL: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కల్వకుర్తి మున్సిపాలిటీలో అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. కల్వకుర్తి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులలోని 28 వేల మంది ఓటర్ల వివరాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించారు. జనవరి 1న ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ జనవరి 10న తుది జాబితా ప్రచురించానున్నారు.