‘వారణాసి’ కోసం మహేష్ బాబు హరికృష్ణ ఆధ్వర్యంలో కలరిపయట్టు విద్య నేర్చుకున్నాడు. తాజాగా దీనిపై హరికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను గతేడాది మహేష్‌కు శిక్షణ ఇచ్చానని, కానీ ఈ విషయాన్ని అప్పుడే బయటపెట్టొద్దని మేకర్స్ కోరారని చెప్పాడు. అందుకే ఇప్పటివరకూ చెప్పలేదని, ఇంతపెద్ద ప్రాజెక్టుకు పని చేస్తానని అనుకోలేదని, ఆయనకు ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.